Bollywood: ప్ర‌భాస్ ఆదిపురుష్‌లో అల‌నాటి బాలీవుడ్‌ తార‌!

Bollywood: యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ డైరెక్ట్‌ బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ చిత్రంలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో అల‌రించ‌బోతున్నాడు. అలాగే ఈ చిత్రంలో రావ‌ణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి స‌రికొత్త అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

ప్ర‌భాస్ (రాముడి) త‌ల్లిగా కౌస‌ల్య పాత్ర కోసం అల‌నాటి తార Bollywood బాలీవుడ్ న‌టి హేమ‌మాలినిని చిత్ర‌బృందం తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఆమె కూడా అంగీకారం తెలిపిన‌ట్లు అంటున్నారు. Bollywood భారీ పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ రూపొందిస్తోన్న సినిమా కాబ‌ట్టి ఖ‌చ్చితంగా ఆయ‌న ప్ర‌ముఖ న‌టీన‌టుల‌నే తీసుకుంటారు. అందులో భాగంగానే కౌస‌ల్య పాత్ర‌కు హేమ‌మాలినీని ఎంపిక చేసుకున్నార‌ని స‌మాచారం. ఇక ఈ చిత్రాన్ని భూష‌ణ్‌కుమార్‌, క్రిష‌న్ కుమార్‌, రాజేశ్‌నాయ‌ర్‌, ఓంరౌత్‌, ప్ర‌సాద్ సుతార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే Bollywood ఈ చిత్రంలో మ‌రో కీల‌క‌పాత్ర‌ల్లో బాలీవుడ్ స్టార్ అజ‌య్‌దేవ్‌గ‌ణ్ పోషించ‌నున్నాడు.