గోపీచంద్ ఫిర్యాదుపై స్పందించిన క్రాక్ నిర్మాత

సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ సినిమా భారీ వసూళ్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వివాదాలతో ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. తాజాగా తనకు ఇవ్వాల్సిన పెండింగ్ రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదంటూ, వాటిని ఇప్పించాలంటూ నిర్మాత ఠాగూర్ మధుపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దీనిపై వివరణ కోరుతూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి డైరెక్టర్స్ అసోసియేషన్ లేఖ రాసింది.

TAGORE MADHU ON GOPICHAND REMUNARATION

ఈ క్రమంలో దీనిపై తాజాగా ఠాగూర్ మధు స్పందించారు. మిస్ కమ్యూనికేషన్ కారణంగానే ఈ వివాదం నెలకొందని, త్వరలోనే వీటి గురించి పూర్తిగా వివరిస్తానన్నారు. కరోనా సమయంలో బడ్జెట్ భారీగా పెరిగినా సినిమాను పూర్తి చేశామని, తమ సమస్యను నిర్మాతల మండలి తీరుస్తుందని విశ్వసిస్తున్నానంటూ ఠాగూర్ మధు పేర్కొన్నారు.