బిగ్‌బాస్-5లోకి టిక్‌టాక్ స్టార్?

బిగ్‌బాస్-4 గత కొద్దిరోజుల క్రితం ముగియగా.. టాలీవుడ్ యంగ్ హీరో అభిజిత్ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో బిగ్‌బాస్-4షోకు రేటింగ్ అంతగా లేకపోయినా.. ఫినాలే ఎపిసోడ్, సమంత హోస్ట్ చేసిన ఎపిసోడ్ హైలెట్‌గా నిలిచాయి. అయితే ఇప్పుడు బిగ్‌బాస్ 5కి కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కంటెస్టెంట్ల ఎంపిక కూడా మొదలైనట్లు సమాచారం.

DURGA RAO GET BIGBOSS 5 OFFER

ఈ క్రమంలో టిక్ టాక్ స్టార్ దుర్గారావుకు బిగ్ బాస్ 5 ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోది. టిక్ టాక్‌తో పేరు తెచ్చుకున్న దుర్గారావు… ఇప్పుడ ఇంటర్వ్యూలు, పలు షోలలో సందడి చేస్తున్నాడు. ఇక ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో ఒక సీన్‌లో దుర్గారావు కనిపించాడు. ఇక ఈ నెల 12న రాబోతున్న ఎఫ్‌సియుకే సినిమాలో చిన్న పాత్రలో దుర్గారావు కనిపించాడు.

ఈ క్రమంలో దుర్గారావుకు బిగ్ బాస్ 5 ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే దుర్గారావు మరింత పాపులర్ కావడం ఖాయం.