BREAKING NEWS: ప్రముఖ హీరో కన్నుమూత.. షాక్‌లో సినీ పరిశ్రమ

బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒకప్పటి బాలీవుడ్ హీరో రాజీవ్ కపూర్ గుండెపోటుతో ఇవాళ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాజీవ్ కపూర్ వదిన, రిషి కపూర్ భార్య నీతూ కపూర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాజీవ్ కపూర్ వయస్సు 58 సంవత్సరాలు. ఆయన మృతితో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజీవ్ కపూర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

RAJEEV KAPOOR PASSES AWAY

1983లో ఏక్ జాన్ హై హమ్ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైన రాజ్ కపూర్.. ఆ తర్వాత ఆస్మాన్, లవర్ బాయ్, జబర్దస్త్, రామ్ తేరి గంగా మల్లి, అంగారే, జల్‌జలా, హమ్ తు చలే పర్దేశ్, నాగ్ అశ్విన్, జిమ్మేదార్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా రాజీవ్ కపూర్ రాణించారు.