సినిమా మొదలయ్యింది కానీ వకీల్ సాబ్ కనిపించట్లేదు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. దిల్ రాజు, బోణి కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రాండ్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కి ముందే మొదలై ఇప్పటికే చాలావరకు పూర్తయింది. మరికొన్ని రోజుల షూటింగ్ మాత్రం మిగిలి ఉండగా కరోనా కారణంగా ఆగిపోయింది. అన్ లాక్ స్టేజ్ లో మళ్లీ షూటింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మేకర్స్ వకీల్ సాబ్ షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు.

ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రీకరణలో కథానాయిక అంజలి, ఇతర నటీనటులు పాల్గొంటున్నారు కానీ పవన్ కల్యాణ్ మాత్రం వచ్చే నెలలో సెట్స్ లో జాయిన్ అవుతాడు. అప్పటివరకూ ఇతర సీన్స్ ని షూట్ చేయనున్నారు. పవన్ తో పాటు మిగిలిన ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న శ్రుతిహాసన్, నివేద థామస్ లు కూడా వచ్చే నెలలోనే షూటింగులో పాల్గొంటారని తెలుస్తోంది. అన్ని పనులు కంప్లీట్ చేసి సంక్రాంతికి దీనిని విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.