కరోనా కష్టకాలంలో ఎందరికో దేవుడుగా మారాడు సోనుసూద్. లాక్‌డౌన్ సమయంలో చిక్కుకుపోయిన ఎంతో మంది వలసకార్మికులను తమ స్వస్థలాలకు చేర్చి, అలాగే ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ రియల్‌హీరో అయ్యాడు. అయితే తాజాగా ఈ రియల్‌హీరోపై బీఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలోని జుహూ ప్రాంతంలో తన ఆరు అంతస్తుత నివాస భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సోనుసూద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బీఎంసీ కోరింది.
దీనిపై సోనుసూద్ స్పందించగా.. ఇందులో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, హోటల్‌గా మార్చేందుకు తన వద్ద బీఎంసీ అనుమతులు ఉన్నాయని, మహరాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎంసీజెడ్ఎంఏ) రావాల్సిఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా కారణంగా ఆ అనుమతులు రాలేదని.. కరోనా బాధితులను ఉంచేందుకు ఈ హోటల్ వినియోగించినట్లు తెలిపారు. అనుమతులు రాకపోతే ఆ భవనాన్ని తిరిగి నివాసంగా మారుస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో బీఎంసీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేస్తామని.. ఆ తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని జుహూ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సోనుసూద్ పలు సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉంటున్నాడు.