భార్య‌తో క‌లిసి తిరుప‌తికి వెళ్లిన నితిన్‌..

టాలీవుడ్ యంగ్‌హీరో నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా మారాడు. ప్ర‌స్తుతం రంగ్‌దే, చెక్ సినిమాల్లో న‌టిస్తున్నాడు నితిన్‌. అయితే లాక్‌డౌన్ అనంత‌రం ఓ ఇంటివాడైన నితిన్ తాజాగా త‌న భార్య‌తో క‌లిసి తిరుప‌తి వెళ్లాడు. ఈ విష‌యాన్ని నితిన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్ల‌డించారు. కాలి న‌డ‌క‌న ఏడుకోండ‌లు ఎక్కాడు. కేవ‌లం 2.20గంట‌ల్లోనే మెట్ల మార్గం గుండా తిరుమ‌ల చేరుకున్నట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కాగా టెంపుల్‌లో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశాడు. ఇదిలాఉంటే.. నితిన్ భీష్మ‌తో గ‌తేడాది మంచి హిట్‌ను అందుకున్నాడు.

NITHIN TIRUPATHI WITH WIFE

ఈ సినిమా త‌ర్వాత నితిన్ రంగ్‌దే చిత్రంలో న‌టిస్తుండ‌గా.. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీలో నితిన్ స‌ర‌స‌న‌ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా చేస్తోంది. అయితే క‌రోనా లాక్డౌన్‌కు ముందే చిత్ర షూటింగ్‌ను ప్రారంభించిన చిత్ర‌యూనిట్ కొద్దినెల‌ల విరామం అనంత‌రం మ‌ళ్లీ సెట్స్‌పైకి తీసుకువ‌చ్చింది. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించి టీజ‌ర్‌, పోస్ట‌ర్స్ విడుద‌ల కాగా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ చేద్దామ‌నుకున్నారు. కానీ సంక్రాంతి బ‌రిలో చాలా చిత్రాలు ఉన్నందున వేస‌విలో థియేట‌ర్ల‌లోకి తీసుకురావాల‌ని చిత్ర‌బృందం భావిస్తున్న‌ర‌ట‌.. మార్చిలో విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తుండ‌గా.. దేవిశ్రీ‌ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కురుస్తున్నారు.