BIG BREAKING: తమిళనాడు గవర్నర్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో?

టాలీవుడ్ సీనియ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తమిళనాడు గవర్నర్‌గా నియమితులైనట్లు సమాచారం. కేంద్రం పరిశీలనలో ఆయన పేరు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కృష్ణంరాజుకి గవర్నర్ పదవి లభిస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆయన కోరిక నెరవేరినట్లు సమాచారం. ప్రస్తుతం కృష్ణంరాజు బీజేపీ పార్టీలో ఉన్నాడు. గతంలో బీజేపీ ఎంపీగా గెలిచిన ఆయన.. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

KRISHNAM RAJU TAMILANADU GOVERNER

ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలతో కృష్ణంరాజుకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెబల్ స్టార్ చాలా ఏళ్ల నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. ఎన్నో పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా.. బీజేపీలోనే కొనసాగుతున్నారు. దీంతో బీజేపీకి అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు టాక్.

కేంద్రం కృష్ణంరాజు పేరునే ఖరారు చేస్తే… గవర్నర్ పదవి అలంకరించిన తొలి నటుడు ఆయనే అవుతారు.
1998 నుంచి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. వచ్చినా రాకున్నా ఆయన పార్టీకోసం పనిచేస్తున్నారు.