ఆధునిక స్వతంత్ర్య భావాలు కలిగిన మహిళల గురించి తెలిపే కథాంశంతో తెలుగులో తెరకెక్కిస్తున్న తొలి అంథాలజీ సిరీస్‌ని ఓటీటీ దిగ్గజ నెట్‌ప్లిక్స్ రిలీజ్‌కి రెడీ చేసింది. దీని కోసం ప్రతిభావంతులైన నలుగురు దర్శకులు నాగ్ అశ్విన్, నందినిరెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్‌రెడ్డిలను ఒక చోట చేర్చింది నెట్‌ప్లిక్స్. హిందీలో విజయవంతమైన లస్ట్ స్టోరీస్ వెబ్‌సిరీస్‌కు ఇది రీమేక్‌గా వస్తుంది. తాజాగా ఈ వెబ్‌సిరీస్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ వెబ్‌సిరీస్‌లో జగపతిబాబు, శ్రుతిహాసన్, అమలాపాల్, ఈషా రెబ్బా, లక్ష్మీ మంచు, అషిమా నర్వాల్, సత్యదేవ్, సాన్వే మేఘనా, సంజిగత్ హెగ్దే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహిళలు, పురుషుల విషయంలో ప్రేమ, సాన్నిహిత్యం, ద్రోహం, హృదయ విదారక అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో పిట్టకథలు ఆంథాలజీ కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఇక పిట్టకథలు సంకలనం 190 దేశాలలో నెట్‌ప్లిక్స్‌లో ఫిబ్రవరి 19నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు మేకర్స్. ఇక రాముల అనే టైటిల్‌తో మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఎపిసోడ్‌కు పెళ్లిచూపులు ఫేం తరుణ్‌భాస్కర్ దర్శకత్వం వహించారు. మీరా అనే టైటిల్‌తో జగపతిబాబు-అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎపిసోడ్‌కు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. అలాగే శ్రుతిహాసన్ ప్రధాన పాత్రల్లో ఎక్స్ లైఫ్ ఎపిసోడ్‌కు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. పింకీ అనే టైటిల్‌తో ఈషారెబ్బా జోడీగా సత్యదేవ్ నటించిన ఎపిసోడ్‌కు సంకల్ప్‌రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఇక ఈ చిత్రాన్ని నలుగురు దర్శకులు కలిసి ప్రేక్షకులకు విభిన్న కథాంశాలను ఒకే సమాహారంగా చేసి చూపించడం ప్రేక్షకుల్లో సరికొత్త అనుభూతిని ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ వెబ్‌సిరీస్‌ను ఆర్ ఎస్వీపీ, ఫ్లైయింగ్ యూనికార్న్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.