మెగాస్టార్ ‘ఆచార్య’ రిలీజ్ అప్పుడే?

చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి ఆధారంగా ఈ సినిమాను కొరటాల తెరకెక్కిస్తున్నాయి. మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇందులో రాంచరణ్ కీలక పాత్రలలో నటిస్తున్నాడు.

ACHARYA RELEASE IN MAY

ఈ సినిమా టీజర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిరు-రాంచరణ్ కలిసి నటిస్తుండటంతో.. ఈ సినిమా కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.