పెళ్లి చూపులు పిల్ల రీతూ వర్మ తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయదేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం పెళ్లి చూపులు. ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీతూవర్మ. మొదటి సినిమాకే తన నటనతో మెప్పించిన రీతూ వర్మ, బెస్ట్ యాక్ట్రెస్ గా నంది పురస్కారం సొంతం చేసుకుంది. ఆ తరువాత నిఖిల్‌తో క‌లిసి కేశ‌వ చిత్రంలో న‌టించింది కానీ ఆ మూవీ రీతూ వర్మ కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు. దీంతో రీతూ వర్మ తెలుగు నుంచి తమిళ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ లక్ టెస్ట్ చేసుకుంది. అక్కడ గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో విక్రమ్ పక్కన నటించే అవకాశం రావడంతో రీతూ కెరీర్ సెట్ అయిపొయింది అనుకుంది. అయితే ఇప్పటివరకూ టీజర్, ట్రైలర్ వరకే వచ్చాయి కానీ రిలీజ్ ఎప్పుడూ అంటే విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి కూడా సమాధానం తెలియకపోవచ్చు.

కోలీవుడ్ లో ఆశలు కూడా దాదాపు గల్లంతవ్వడంతో రీతూ వర్మ, మళ్లీ తెలుగు తెరపై మెరవడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే శర్వానంద్ తో ఒక సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిన రీతూ, అది సెట్స్ పై ఉండగానే మరో మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ శౌర్య హీరోగా నటించనున్న ఈ మూవీలో రీతూవర్మ హీరోయిన్ గా నటించనుందట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళగానే ఇండియా, పారిస్ దేశాల్లో షూట్ చేయనున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ శర్వా, శౌర్య సినిమాలు అయినా రీతూ వర్మ కెరీర్ ని సెట్ చేస్తాయేమో చూడాలి.