వెంకటేష్ స్పీడ్ పెంచాడు, ఇద్దరు డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్

విక్టరి వెంకటేశ్ F2 తరువాత చేస్తున్న సినిమా వెంకీ మామ, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వెంకీ మామ అయ్యాక, వెంకటేశ్ చేయబోతున్న సినిమా ఏంటి అనే ప్రశ్నకి అసురన్ రీమేక్ సమాధానంగా నిలిచింది. ధనుష్ నటించిన ఈ సినిమా దసరాకి విడుదలై 200కోట్లు రాబట్టింది. వెంకటేశ్ 74వ సినిమాగా రానున్న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. వెంకీ మామ రిలీజ్ అయ్యాక, అసురన్ రీమేక్ చిత్ర యూనిట్ ని ప్రకటించే అవకాశం ఉంది.

అయితే అసురన్ తర్వాత వెంకటేష్, వినాయక్ కాంబినేషన్ లో ఒక సినిమా, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక మూవీ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ కూడా అయ్యింది. ప్రస్తుతం మాటల మాంత్రికుడికి ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ కాగానే, ఈ సినిమా స్టార్ట్ అవనుందని సమాచారం. ఈ ఇద్దరు డైరెక్టర్స్ ని లూప్ లైన్ నే పెట్టిన వెంకటేష్, యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. అసురన్ తర్వాత వెంకటేష్ ఏ మూవీ చేస్తాడు అనేది పక్కాగా తెలియదు కానీ ఈ నలుగురిలో ఒకరితో మాత్రం వర్క్ చేసే అవకాశం ఉంది.