Pavankalyan: జనసేనాని పవన్‌కళ్యాణ్.. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న జనసేన నేత వెంగయ్యనాయుడి కుటుంబాన్ని పరామర్శించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 16న కోనపల్లికి వచ్చిన ఎమ్మెల్యే రాంబాబును డ్రైనేజీ అధ్వానమైన పరిస్థితులపై జనసేన నేత వెంగయ్య ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే ఎదురు దాడికి దిగడంతో కంగుతిన్న వెంగయ్య ఎమ్మెల్యేకి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో అవమానాన్ని తట్టుకోలేక వెంగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో జనసేనాని Pavankalyan పవన్‌కళ్యాణ్ ఎమ్మెల్యే రాంబాబుపై తీవ్రంగా ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన అన్నా రాంబాబు.. ఇప్పుడు మమ్మల్ని చంపేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా.. జనసైనికుల జోలికి వస్తే ఖాళీగా కూర్చునే వ్యక్తిని కాదన్నారు.. తాను వచ్చి వైసీపీ నేతల ఇళ్ల ముందు కూర్చుంటే పశ్చాతాపానికి కూడా అవకాశం ఉండదని పవన్ హెచ్చరించారు. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని, లేకపోతే యుద్ధం మొదలుపెడతామని పవన్ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఇక వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన Pavankalyan ఆయన.. వెంగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే వెంగయ్య నాయుడు కుటుంబానికి రూ. 8లక్షలు 50వేలు జనసేన తరపున ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారి పిల్లల చదువులు బాధ్యతను తానే తీసుకుంటానని Pavankalyan పవన్ హామీ ఇచ్చారు. అలాగే వెంగయ్య అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఎస్పీని Pavankalyan పవన్, నాదెండ్ల మనోహర్ కలిసారు. వెంగయ్య కుటుంబ సభ్యులు కూడా ఎస్పీకి వివరాలు తెలిపారు. ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పాల్పడ్డ చర్యలకు ఆయనను శిక్షించే ధైర్యం జగన్‌కి ఉండదా? అని పవన్ ప్రశ్నించారు. వెంగయ్య మృతి ఆ పార్టీ నేతల పతనానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అలాగే వైసీపీ నేతల చర్యలపై రాస్తే జర్నలిస్టులను కూడా వదలటం లేదని వారిపై కూడా కేసులు పెడుతున్నారని.. ఎస్పీతో రెండు చేతులు జోడించి దీనిపై వెంటనే చర్యలను తీసుకోవాలని Pavankalyan పవన్ వేడుకున్నారు.