ఆర్జీవీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదేనట

సంచలన సినిమాలతో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఇప్పుడు ఒక వివాదాస్పద వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. డీ కంపెనీ అనే వెబ్‌సిరీస్‌ను ఆర్జీవీ తెరకెక్కిస్తుండగా.. దీనికి సంబంధించిన టీజర్‌ను ఇవాళ విడుదల చేశారు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు అని ఆర్జీవీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వెబ్‌సిరీస్‌ను మహాభారతంతో పోలుస్తూ మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్ అని ఆర్జీవీ కామెంట్ చేశాడు.

rgv d companey

గ్యాంగ్ స్టర్ సినిమాల అన్నింటికి ఇది మదర్ లాంటిది అని ఆర్జీవీ కామెంట్ చేశాడు. ఒక వీధి ముఠాను దావూద్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌గా ఎలా మార్చాడనే దానిపై ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ తెలిపాడు. స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.