బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఏకంగా పాన్ ఇండియా సినిమాతో

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి ఫ్యామిలీ హీరోలకు ఉన్నంత అభిమానులు ఏ హీరోలకు లేరు. యుగపురుషుడు నందమూరి తారకరామారావు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. టాలీవుడ్‌లో ఎన్నో సంవత్సరాలపాటు ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి అడుగుపెట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో నటవారసుడు ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

mokshagna cine entry

బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా పాన్ ఇండియా సినిమాతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. దీనికి డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ డెబ్యూ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలొస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించనున్నారట. అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని వినికిడి.