ఆ డైరెక్టర్‌తో పవన్ సినిమా ఫిక్స్ అయినట్లే?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ నటించిన సినిమా ఇదే కావడంతో.. దీనికోసం పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశముంది.

pawan movie with surenderreddy

ఇక ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాలో పవన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ మరో సినిమాను ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కిక్, రేసుగుర్రం, సైరా లాంటి సూపర్ హిట్ సినిమాలను తీసిన సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఒక సినిమా చేసేందుకు పవన్ ఒకే చెప్పినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలే పవన్‌ను సురేందర్ రెడ్డి కలిసి కథ వినిపించాడట. పవన్‌కు కూడా కథ నచ్చడంతో సినిమా చేసేందుకు ఒకే చెప్పారని టాక్ నడుస్తోంది.