సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న శ్రీ‌దేవి చిన్న కూతురు!

దివంగ‌త ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దేవి పెద్ద కూతురు జాన్వీక‌పూర్ ఇప్ప‌టికే సినీ తెరంగ్రేటం చేసిన విష‌యం తెలిసిందే. ఇక అక్క బాట‌లోనే చెల్లి ఖుషీ క‌పూర్ త్వ‌ర‌లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. ఈ విష‌యంపై శ్రీ‌దేవి భ‌ర్త, నిర్మాత బోనీ క‌పూర్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఖుషీక‌పూర్‌ను న‌టిగా సినీ రంగానికి ప‌రిచ‌యం చేయ‌డానికి త‌న ద‌గ్గ‌ర అన్ని ఉన్నాయ‌ని.. కానీ ఆమెను మాత్రం న‌టిగా ప‌రిచ‌యం చేసేది తాను కాద‌ని తెలిపాడు.

kushi kapoor film

ఎందుకంటే నిర్మాత‌గా త‌న‌కు, న‌టిగా ఖుషీకి ఇది మంచిది కాద‌ని తెలిపారు. త‌న పెద్ద కూతురు జాన్వీక‌పూర్‌ లాగానే చిన్న కూతురు కూడా సొంతంగా ఎద‌గాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని.. కాబ‌ట్టి సినీ ఇండస‌స్ట్రీకి తాను మాత్రం ప‌రిచ‌యం చేయ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే.. గ‌తంలో ఖుషీక‌పూర్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడ‌మీలో న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంద‌ట‌.. ఇక జాన్వీక‌పూర్‌ను ఇండ‌స్ట్రీకి ఇంట్ర‌డ్యూస్ చేసిన బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్‌జోహారే త‌న‌ను కూడా ప‌రిచ‌యం చేస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌ను వ్య‌క్తప‌రించింద‌ట ఖుషీక‌పూర్‌.