ఒకే వేదిక‌పై టాలీవుడ్ క‌మెడియ‌న్స్ హ‌ల్‌చ‌ల్‌!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప‌లువురు క‌మెడియ‌న్స్ రీయూనియ‌న్ పేరుతో ప్ర‌తి రెండో శ‌నివారం క‌లిసి ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించుకుంటారు. అయితే క‌రోనా కార‌ణంగా ఈ క‌ల‌యిక‌కు బ్రేక్ ప‌డి.. దాదాపు ఓ ఏడాది త‌ర్వాత ఇటీవ‌ల మ‌ళ్లీ క‌లిశారు. కాగా ఈ రీయూనియ‌న్ కార్య‌క్ర‌మంలో.. శ్రీనివాస‌రెడ్డి, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, ధ‌న‌రాజ్‌, స‌త్య‌, స‌త్యం రాజేశ్‌, చిత్రం శ్రీ‌ను, వేణు, తాగుబోతు ర‌మేశ్ , ర‌ఘు, ప్ర‌వీన్ క‌మెడియ‌న్స్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌మెడియ‌న్స్ తెలుపుతూ..

young comedians

ప్ర‌తి రెండో శ‌నివారం నాడు తమ క‌ల‌యిక త‌ప్ప‌కుండా ఉంటుంద‌న్నారు. అలాగే మేమంద‌రం ఇలా క‌లిస్తే ఆత్మ‌విశ్వాసాన్ని, ఎన‌ర్జీని పెంపొందిస్తుంద‌న్న‌దే భావ‌న క‌లుగుతుంద‌ని.‌. కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కే ప‌రిమితం కాద‌ని, సోష‌ల్ ఎవేర్‌నెస్ కోసం కూడా అంటున్నారు. దీనిలో భాగంగా ఐ డొనేష‌న్‌, బ్ల‌డ్ డొనేష‌న్ వంటి కార్య‌క్ర‌మాల‌తో పాలు ప‌లు స‌హాయ కార్య‌క్ర‌మాల‌కు కోసం త‌మ క‌ల‌యిక ఉంటుంద‌ని చెప్పారు. గ‌తంలో ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఎంతో మంది న‌టీన‌టులకు, వారి పిల్ల‌ల‌కు వైద్య‌, విద్య‌కు సాయం అందించారు. ఇక ఇప్ప‌డినుంచి డ్రెస్ కోడ్ కూడా పాటిస్తామ‌ని, చాలా రోజుల త‌ర్వాత క‌మెడియ‌న్స్ అంతా రీయూనియ‌న్ పేరిట ఇలా క‌లుసుకోవ‌డం ఎంతో సంతోషంగా ఉందని క‌మెడియ‌న్స్ ఆనందం వ్య‌క్తం చేశారు.