‘ఖిలాడి’ డైరెక్టర్‌తో పవన్ మూవీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మించిన ‘వకీల్ సాబ్ ‘సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవ్వగా… ఉగాదికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశముంది. ఇక ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో రానున్న సినిమాలో పవన్ నటిస్తున్నాడు. దీంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో పవన్ నటించనున్నాడు. ఈ సినిమాకు కె.చంద్ర దర్శకత్వం వహించనుండగా.. త్రివిక్రమ్ మాటలు అందించనున్నాడు.

pawan ramesh varma

అయితే తాజాగా పవన్ మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ఖిలాడీ సినిమా చేస్తున్న రమేష్ వర్మ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రమేష్ వర్మ చెప్పిన స్టోరీ నచ్చడంతో.. సినిమా చేసేందుకు పవన్ ఒకే చెప్పేశాడట.