పవన్-క్రిష్ మూవీ టైటిల్ ఇదే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది. హిస్టారికల్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తుండగా.. టైటిల్ విషయంలో అనేక పేర్లు వినిపించాయి. బందిపోటు, విరూపాక్ష, వీరముల్లు అనే టైటిల్స్ గతంలో వినిపించాయి.

HARI HARA VEERAMALLU TITLE

అయితే తాజాగా మరో టైటిల్ వినిపించింది. హరి హర వీరమల్లు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించినట్లు సమాచారం త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పాన్ ఇండియా సినిమాగా దీనిని రూపొందిస్తుండగా.. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించనుందని వార్తలొస్తున్నాయి. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించనుండగా.. ఏ ఎం రత్నం ఈ సినిమాను నిర్మించనున్నాడు.