‘పుష్ప’ సీన్స్ లీక్

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయిన అల్లు అర్జున్-సుకుమార్-దేవీ శ్రీ ప్రసాద్ కలయికలో ప్రస్తుతం పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ప్రస్తుతం పుష్ప షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా బన్నీ రంపచోడవరం చేరుకున్నాడు. దీంతో అభిమానులు బన్నీకి ఘనస్వాగతం పలికారు. రంపచోడవరంలో బన్నీ సందడి చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

PUSHPA SONG SHOOTING VIDEO

తాజాగా పుష్ప సాంగ్‌ షూటింగ్‌కి సంబంధించిన వీడియో లీక్ అయింది. అడవిలో ఈ సాంగ్ షూటింగ్ చేస్తుండగా.. డ్యాన్సర్లు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. అలాగే పాటకు సంబంధించిన బీట్ కూడా ఇందులో వినిపిస్తోంది. బన్నీతో పాటు డ్యాన్సర్లు ఇందులో కాలు కదుపుతున్నట్లు ఉంది.