జీవిత డైరెక్షన్‌లో రాజశేఖర్ నాలుగో సినిమా?

జీవిత డైరెక్షన్‌లో హీరో రాజశేఖర్ మరో సినిమా చేయనున్నాడనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. గతంలో జీవిత దర్శకత్వంలో శేషు, ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే సినిమాల్లో రాజశేఖర్ నటించాడు. తాజాగా ఈ భార్యభర్తల కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. చివరిగా గరుడవేగ సినిమాతో రాజశేఖర్ హిట్ అందుకున్నాడు.

RAJASEKHAR IN JEEVITHA DIRECTION

ఆ తర్వాత కల్కి అనే సినిమా వచ్చినా… అది ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. అయితే ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోగా రాజశేఖర్ నటించనుండగా… డైరెక్టర్ నీలకంఠ ఈ సినిమాను తెరకెక్కించాల్సి ఉంది. ఈ మేరకు నీలకంఠ స్క్రీఫ్ట్ వర్క్ కూడా చేశారు.

కానీ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల నీలకంఠ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం జీవిత మరోసారి డైరెక్టర్‌గా మారనుందని వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది చూడాలి.