Telangana New CM: కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు.. డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

Telangana New CM: త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి మారనున్నారా?.. కేసీఆర్ స్థానంలో సీఎంగా ఆయన కుమారుడు కేటీఆర్ రానున్నారా?.. అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఇటీవల టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వార్తలను బట్టి చూస్తే ఇది నిజమేనని చాలామంది నమ్ముతున్నారు. కేటీఆర్ కాబోయే సీఎం అని, కేటీఆర్ సీఎం అయితే తప్పేంటీ అని గత రెండు రోజులుగా టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏకంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు ‘కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు’ అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

ktr become cm in febuary

డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇవాళ సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగుల సమక్షంలో మాట్లాడుతూ ..ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో ఈ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఫిబ్రవరిలోనే సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకం ఉంటుందని వార్తలొస్తున్నాయి.