Tollywood: ప‌లు భాష‌ల్లో తెర‌కెక్కుతున్న నాగ‌చైత‌న్య ‘ల‌వ్‌స్టోరి’..

Tollywood: నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా ల‌వ్‌స్టోరీ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రం కు సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్ మ‌రీ ముఖ్యంగా దీంట్లో సారంగ‌ద‌రియా సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తుంది. ఈ సాంగ్‌లో సాయిప‌ల్ల‌వి డ్యాన్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రించింది. దీంతో ఈ Tollywood సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

Nagachaithanya

కాగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌ వంటి ప‌లు భాషల్లో తెర‌కెక్కుతుంద‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ Tollywood చిత్రం ఏప్రిల్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది.