దేవుడితో సమానంగా చూడడం ఆయనకే చెల్లింది

పూర్వం రోజుల్లో తిరుపతి వెంకన్న దర్శనం తరువాత నేరుగా మద్రాస్ వెళ్లి తెల్లవారుజామునే అన్న ఎన్టీఆర్ గారి దర్శనం చేసుకొన్న తర్వాత సొంత గ్రామాలకి బయలుదేరే వారు భక్తులు.

మద్రాసు,బజుల్లా రోడ్డులో వున్న శ్రీ యన్.టి.రామారావు ఇంటి ముందు ప్రతి ఉదయం టూరిస్టు బస్సులు కనిపిచేవి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసు వచ్చే యాత్రికులు శ్రీ రామారావు గారిని చూడ్డానికి వచ్చేవారు.భోరుని వర్షం కురుస్తున్నాసరే,లక్ష్య పెట్టక,అభిమానులు ఆయన దర్శనం కోసం ఆయన యింటి ముందు కాచుకుని వుండేవారు. ఉదయం ఐదున్నర,ఎనిమిది గంటల మధ్య యాత్రికులు వచ్చేవారు,ఆ సమయంలో శ్రీ రామారావు గారు వారికి కనిపించి,ఆప్యాయతగా వారిని పలకరించి,కుశల ప్రశ్నలు వేసేవారు

తిరుపతి నుంచి మద్రాసు వచ్చే యాత్రీకులు ఆయన్ని చూస్తేగాని తిరిగి వెళ్ళేవారు కారు,నాటి మద్రాసు రామారావు గారి ఇళ్ళు రెండో తిరుపతి గా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఎంతోమంది నటులు,నాయకులు ఉన్నారు కానీ దేవుడి లా కొలవబడిన ఏకైక నటుడు,నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు