మరోసారి ఆ డైరెక్టర్ తో చిరంజీవి మరో సినిమా

ప్రస్తుతం బింబిసార సినిమా దర్శకుడు వసిష్ఠ తో విశ్వంభర సినిమా తీస్తున్నారు చిరంజీవి. అయితే ఈ సినిమాలో త్రిష లీడ్ రోల్ గా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సెర వేగంగా జరుగుతుంది అని చెప్పుకోవాలి. ఈ సినిమా షూటింగ్ అప్డేట్ లు కూడా ఎప్పటికప్పుడు సినిమా టీం విడుదల చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా చిరు మరో సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ అనే సూపర్ హిట్ పొలిటికల్ సినిమాను రీమేక్ గా చిరంజీవి గాడ్ ఫాదర్ అనే పేరుతో చేసారు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు అదే డైరెక్టర్ మోహన్ రాజా తో మరోసారి మరొక సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఆ సినిమా చిరంజీవి కూతురు అయినా సుష్మిత కొణిదెల నిర్మించనున్నట్లు తెలుస్తుంది.