చెత్త స్క్రీన్‌ప్లే వికలాంగపు బిడ్డవంటిది. చెడ్డ స్క్రీన్‌ప్లే లో మహానటులు కూడా రాణించరు : కమల్‌హాసన్

“కధలు మారవు. మనం కధలు చెప్పే తీరు మారాలి.”__ బాజ్ లెహర్‌మాన్.

“మంచి స్క్రీన్‌ప్లే పేకమేడవంటిది. అందులో ఏ కార్డ్ కదిలినా మేడ మొత్తం కూలిపోతుంది.” __ శామ్యూల్ గోల్డ్విన్.

“చెత్త స్క్రీన్‌ప్లే వికలాంగపు బిడ్డవంటిది. చెడ్డ స్క్రీన్‌ప్లే లో మహానటులు కూడా రాణించరు.” _ కమల్‌హాసన్.

స్క్రీన్‌ప్లే రచనలో బి.యన్.రెడ్డి, కె.వి.రెడ్డి నుండి నేను తొలిపాఠాలు నేర్చుకున్నాను. మల్లీశ్వరి, మాయాబజార్ స్క్రీన్‌ప్లేలు నాకు ప్రామాణిక, పవిత్ర గ్రంధాలు. _ యన్.టి.రామారావు.

ఏడు స్వరాలతోనే లక్షల బాణీలు తయారయినట్టు, కధలు కొన్నే వున్నా విభిన్నమైన స్క్రీన్‌ప్లేలతో వేలాది సినిమాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటాయి.

సినిమా కధకు స్క్రీన్‌ప్లే ప్రాణం అనుకుంటే … ఎన్నో సినిమాలకు తన అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ప్రాణం పోసిన దర్శకులు కె.భాగ్యరాజ్ గారు. స్కీన్‌ప్లేరచనలో ఆయనది అగ్రస్థానం. తమిళంలో ఆయన స్క్రీన్‌ప్లే పై రాసిన పుస్తకాన్ని Suryaprakash Josyula గారు త్వరలో తెలుగులో తీసుకురానుండటం ఆనందించతగ్గ విషయం.

(నా కుంచె చిలికిన నీటిరంగుల్లో రచయిత,దర్శకుడు,నటుడు “తిరక్కదై మన్నన్” కె.భాగ్యరాజ్)
__ దేవీప్రసాద్.