NTR: ఉపరాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా సీనియ‌ర్ ఎన్టీఆర్ పుస్త‌కావిష్క‌ర‌ణ‌..

NTR: తెలుగు వారికి ఆరాధ్య న‌టుడు, తెలుగు దేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు రాజీకీయ జీవితంపై ఓ బుక్‌ను రాశారు. జ‌ర్న‌లిస్ట్ ర‌మేశ్ కందుల రాసిన మేవ‌రిక్ మెస్స‌య‌.. ఏ పొలిటిక‌ల్ బ‌యోగ్రఫి ఆఫ్ NTRఎన్‌టీరామారావు పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఈ నెల 18న నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే ప్ర‌ముఖ ర‌చ‌యిత, రాజ‌కీయ విశ్లేష‌కులు సంజ‌య్ బారు ముఖ్య అతిథిగా రానున్నారు.

ntr book

ఈ వేడుకను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్నారు.. పెంగ్విన్ ర్యాండ‌మ్ హౌస్ ఇండియా వారు ఈ పుస్తకాన్ని ముద్రించ‌గా.. సినిమాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు NTRఎన్టీఆర్ ఎలాంటి రాజ‌కీయ అవ‌గాహ‌న లేకున్నా.. ఇత‌రుల‌కు సేవా చేయాల‌నే ఉద్దేశ్యంతో తాను రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టి NTRఎన్టీఆర్ దేశ రాజ‌కీయాల్లో ఏవిధంగా త‌న‌దైన ముద్ర వేశార‌న్న‌ది ఈ పుస్త‌కంలో ఉన్న‌ట్టు ర‌చ‌యిత వివ‌రించారు.