BIG BREAKING: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పుడు మరో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

MUNCIPAL ELECTIONS NOTIFICATION

మార్చి 10న పోలింగ్ నిర్వహించనుండగా.. మార్చి 14న ఫలితాలు వెల్లడించనున్నారు. మార్చి 3న మధ్యాహ్నం మూడు గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువును ఎన్నికల సంఘం విధించింది.