ఓ ఇంటివాడైన టాలీవుడ్ యంగ్ హీరో

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ ఎం.ఎస్. రాజు కుమారుడు హీరో సుమంత్ అశ్విన్ ఒక ఇంటివాడయ్యాడు. హైదరాబాద్‌ శివారులోని ఫాంహౌస్‌లో కొంతమంది బంధువులు, సన్నిహితులు సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది. కరోనా క్రమంలో ఇండస్ట్రీ నుంచి కొంతమంది నటులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీపిక అనే అమ్మాయికి సుమంత్ మూడు మూళ్లు వేశాడు.

hero sumanth marriage

తూనీగ తూనీగ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. ఆ తర్వాత లవర్స్, కేరింత వంటి సినిమాలు అశ్విన్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. సుమంత్ అశ్విన్ నటించిన తాజా చిత్రం ఇది మా కథ మార్చి 19న విడుదల కానుంది.