అంతటా పుష్ప పాటలే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 కోసం అటు బన్నీ అభిమానులే కాకుండా ప్రతి సినిమా లవర్ వేచి చూస్తున్నారు. రష్మిక మందన్న కథానాయకిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప : ది రైజ్’ భారీ విజయం సాధించింది. దానికి సీక్వెల్ ఈ ‘పుష్ప : ది రుల్’. పుష్ప 1 సినిమా పరంగానే కాకుండా పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 1 & 2 కు సంగీతం అందించారు. ఇది ఇలా ఉండగా పుష్ప నుండి ఇప్పటి విడుదల అయినా గ్లింప్సె, టీజర్ మరియు రెండు పాటలు ఎంతో బజ్ తీసుకొచ్చాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేసారు. పుష్ప 2 లోని పాటలను సినిమా విడుదల వరుకు, అలాగే సినిమా విడుదల జరిగిన 90 రోజులు వరుకు టీవీ చానెల్స్ లో, అలాగే వారి డిజిటల్ ప్లాట్ఫారం లో ప్లే చేసుకోవచ్చు అని ఆ ప్రకటన ద్వారా వెల్లడించారు. కానీ పాటలలో ఎటువంటి మార్పులు చేయవద్దని ఆ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.