సినిమా లవర్స్ కు శుభవార్త

రేపు అనగా 31 మే న సినిమా లవర్స్ డే సందర్భంగా PVR inox, సినెపోలిస్ ఇండియా, మిరాజ్ సినిమాస్, ముల్తా A2 & మూవీ మాక్స్ ఒక ఆఫర్ ఇచ్చారు. మల్టీప్లెక్స్ ఇంకా సింగల్ థియేటర్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటి అంటే రేపు శుక్రవారం ప్రేక్షకులకు కేవలం 99 రూపాయలకే సినిమా చూసే అవకాశం ఇచ్చారు. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న సినిమా లవర్స్ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.