నితిన్ ‘రాబిన్హుడ్’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న థియేట్రికల్ రిలీజ్

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్హుడ్ లో హీరో నితిన్ మునుపెన్నడూ లేని తరహా పాత్రలో అద్భుతంగా కనిపించబోతున్నాడు. వెంకీ కుడుముల తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు నితిన్ని పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. అతన్ని దొంగగా పరిచయం చేసిన టీజర్ హాస్యభరితంగా ఉండగా, బర్త్ డే గ్లిమ్ప్స్ పూర్తి యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. రాబిన్హుడ్ డిసెంబర్ 20న విడుదల కానుంది. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు ఈ సినిమాకి కలిసి రానున్నాయి. కమర్షియల్ అంశాలే కాకుండా తగినంత వినోదాన్ని కలిగి ఉండే సినిమాకి ఇది సరైన విడుదల. రిలీజ్ డేట్ పోస్టర్ లో నితిన్ ముఖం లో ఇంటెన్సిటీ కలిగి ఉండి  స్పోర్ట్స్ బైక్పై మ్యాచో లా కనిపిస్తున్నాడు

తారాగణం: నితిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్
CEO: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: సాయి శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో