‘ఫ్యామిలీ స్టార్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్?

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ప్రసారం కానుందని టాక్. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా గా నటించారు. ఉగాది కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు.