ఇప్పుడైనా రిలీజ్ డేట్ చెప్పు చిన్నవాడా…

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం. ఎప్పుడో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ పూర్తి చేసుకోని ప్రేక్షకుల ముందుకి రావాల్సిన ఈ సినిమా రకరకాల సమస్యల వల్ల విడుదల కాకుండా ఆగిపోయింది. సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకొని ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రతిసారి ఏదో ఒక పెద్ద సినిమా బయటకి రావడం, అర్జున్ సురవరం ఆగిపోవడం. గత ఆరు నెలలుగా అర్జున్ సురవరవం విషయంలో జరుగుతున్న తంతు ఇదే.

ఇలాంటి నేపథ్యంలో అర్జున్ సురవరం సినిమాకి ఉన్న రిలీజ్ అడ్డంకులు అన్నీ నిఖిల్ తొలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అర్జున్ సురవరం సినిమాకి కొత్త రిలీజ్ డేట్ వచ్చిందని సమాచారం. అయితే ముందులాగా విడుదల తేదీని చెప్పకుండా అన్నీ పక్కాగా క్లియర్ చేసుకున్న తర్వాతే మహా అంటే వారం లేదా పదిరోజుల ముందు రిలీజ్ డేట్ ప్రకటించి, ఫాస్ట్ గా ప్రమోషన్ చేసి, విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారట. అర్జున్ సురవరం నిర్మాత ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం లావణ్య చేతిలో కూడా సినిమాలు లేవు, అర్జున్ సురవరం హిట్ అయితేనే ఆమె కెరీర్ లో ఏదైనా మార్పు రావొచ్చు.