సామజవరగమన సోషల్ మీడియాలో ట్రెండింగ్

లిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ విడుదల అయిన విషయం విదితమే. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్ మ్యూజిక్ అలరిస్తోంది. మొదటిసారి స్టార్ హీరో సినిమాకి పాట పాడిన సిడ్ శ్రీరామ్ సామజవరగమన పాటకి ప్రాణం పోశాడు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఈ పాట విడుదలైన 48 గంటల్లో 8.6 మిలియన్ వ్యూస్, 389కే లైక్స్ రావడం విశేషం. తెలుగులో మొదటిసారి ఒక పాట ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం గొప్ప విషయం. బన్నీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ఈ సామజవరాగమన వ్యూస్ చెప్తాయి. సామజవరగమన సాంగ్ విడుదలైన మొదటి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం.