బాబోయ్ మరీ ఇంత రొమాంటికా?

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకాశ్‌ను తనసినిమాలతోనే పరిచయం చేసిన పూరి.. ఆకాష్ ని హీరోగా నిలబెట్టడానికి తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాను కథని ఇస్తూ ఆకాష్ ని డైరెక్ట్ చేసే పని శిష్యుడి చేతిలో పెట్టాడు. ‘రొమాంటిక్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని పూరి నిర్మిస్తున్నాడు. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కన్నా ముందు ప్రీలుక్ ని రిలీజ్ చేశారు. హీరోయిన్‌ను భుజాలపై ఎత్తుకున్న ఆకాశ్‌ను బ్యాక్‌సైడ్‌ నుంచి చూపించిన ఈ పోస్టర్‌ ఆకస్తిని కలిగించింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే కేతిక శర్మని ఆకాష్ హాగ్ చేసుకున్నట్లు డిజైన్ చేశారు. ఆకాష్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు.

పూరి మార్క్ కనిపిస్తూ నిజంగానే రొమాంటిక్‌ అనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ చూసిన నెటిజెన్స్ మాత్రం పూరి పిల్లాడిని చెడగొడుతున్నాడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. యూత్ ని టార్గెట్ చేస్తూ పక్క రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ జెనరేషన్ ఇడియట్ సినిమాలా ప్రేక్షకులని అలరిస్తుంది అనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉన్నారు. ఇక హీరోయిన్ కేతిక శర్మ మొదటి సినిమాకే బ్యాక్ లెస్ ఫోజు ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకి కేతిక శర్మ ఫోటోలు బాగా పరిచయమే. 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కేతిక, ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే ఇంత రొమాంటిక్ గా ఉంటే.. సినిమాలో ఇంకెంత రొమాంటిక్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అనిల్ పాడూరి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోని త్వరలో రొమాంటిక్ ప్రేక్షకుల ముందుకి రానుంది.