Mega Daughter: మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా గడుపుతుంది నిహారిక. అయితే ఈ క్రమంలో ఓ షూటింగ్లో భాగంగా ఆమె కాలికి గాయం అయింది. దీంతో ఆమె ఇంటి దగ్గరనే విశ్రాంతి తీసుకుంటుంది.
ఈ విషయాన్ని తాజాగా Mega Daughterఆమె సోషల్ మీడియా వేదికగా కాలికి గాయమైన ఫోటోను పోస్ట్ చేసింది.. దీంతో ఆమె విశ్రాంతి తీసుకుంటుండడంతో చైతన్య సేవలు అందిస్తున్నాడు. బ్రోకెన్ వైఫ్‌ను తన భర్త పాంపర్ చేస్తున్నాడంటూ నిహారిక పేర్కొంది. అయితే Mega Daughter తనకు కాలికి గాయం అయిన విషయాన్ని నిహారిక అధికారికంగా చెప్పలేదు.. కానీ ఫోటోలో ఆమెకు కాలికి ఉన్న పట్టీ చూసి ఖచ్చితంగా గాయపడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.