ప‌వ‌ర్‌స్టార్ నాకు దేవుడు.. బ‌ద్నాం చేయ‌కండి ప్లీజ్: జూనియ‌ర్ స‌మంత

నితిన్ న‌టించిన ఛ‌ల్ మోహ‌న్ రంగ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ చేసిన అషురెడ్డి టాలీవుడ్‌లో జూనియ‌ర్ స‌మంత‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. అచ్చం ఆమె స‌మంతలానే ఉండ‌డంతో జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకుంది. ఇక ఆమెకు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ అంటే చ‌చ్చేంత ఇష్టం.. ఆయ‌న‌ను దేవుడిలా ఆరాధిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే ప‌వ‌న్ ను క‌లిసిన ఆమె ఆయ‌న‌తో ఒక లేఖ‌ను రాయించుకుని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. నా దేవుడిని మ‌ళ్లీ క‌లుసుకున్నాను. ఆయ‌న నన్ను గుర్తు ప‌ట్టారు. నా ప‌చ్చ‌బొట్టును కూడా గుర్తుంచుకున్నారు. దాదాపు రెండు గంట‌ల పాటు మాట్లాడారు. మీరు ఎప్పుడు నా ఫ‌స్ట్ ల‌వ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటూ రాసుకొచ్చింది.

power ashureddy

అయితే ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్ ఆమెను ఒక ప్ర‌శ్న అడిగారు.. ప‌వ‌న్ అంగీక‌రిస్తే, ఆయ‌న‌కు నాలుగో భార్య‌గా వెళుతారా.. అని అడ‌గ్గా.. ఓకే అన్న‌ట్లు తెలిపింది. దీంతో ఈ విష‌యం కాస్త వైర‌ల్ గా మారి సోష‌ల్ మీడియాలో వివాదంగా మారింది. ఇక ఈ వార్తాల‌కు కౌంట‌ర్ ఇస్తూ తాజాగా అషు రెడ్డి వీడియో రిలీజ్ చేసింది. ప‌వ‌న్ నాకు దేవుడితో స‌మానం.. అభిమానం అంటే అదొక భ‌క్తి .. ఆయ‌నంటే నాకు అభిమానం. మ‌ళ్లీ చెబుతున్నాను. మీ రాత‌ల వ‌ల్ల ప‌వ‌న్ గారు అమ్మాయిల‌ను క‌ల‌వాలా వ‌ద్దా అనుకుంటారు. మీ వ‌ల్ల నా పేరు నాశ‌నం అవుతుంది న‌న్ను బ‌ద్నాం చేయ‌కండి ప్లీజ్ అని ఆ వీడియో ద్వారా అషు మండిప‌డింది. ‌‌