నిహారిక రిసెప్షన్‌లో అదే హైలెట్

మెగా డాటర్ నిహారిక, జోన్నలగడ్డ చైతన్యల రిసెప్షన్ శుక్రవారం రాత్రి జేఆర్సీ కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కొంతమంది మాత్రమే హాజరయ్యారు. దాదాపు 200 మందితో సింఫుల్‌గా ఈ వేడుకను నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా కుటుంబ సభ్యులందరూ ఈ ఫంక్షన్‌కు హాజరై సందడి చేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుక కోసం జేఆర్సీ ప్రాంగణాన్ని గ్రాండ్‌గా డెకరేట్ చేయగా.. కరోనా‌ నిబంధనలకు పాటిస్తూ ఈ ఫంక్షన్ నిర్వహించారు.

NIHARIKA

ఈ ఫంక్షన్‌లో ఒకే రంగు డ్రెస్‌లలో నిహారిక, చైతన్యల జంట సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇక నిహారిక, చైతన్యల జంటతో మెగా బ్రదర్ నాగబాబు ఫొటో దిగడానికి వచ్చిన సమయంలో తన తండ్రి చేతులను నిహారిక పట్టుకోవడం హైలెట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నిహారిక రిసెప్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య,నిహారికల వివాహం జరిగిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా ఈ పెళ్లికి హాజరై సందడి చేసింది. డ్యాన్సులతో మెగా ఫ్యామిలీ రచ్చ రచ్చ చేసింది. ప్రత్యేక విమానంలో కొద్దిరోజుల ముందే మెగా ఫ్యామిలీ అంతా ఉదయ్ పూర్ చేరుకుని అక్కడ సందడి చేసింది. ఇక నిహారిక పెళ్లికి వచ్చిన బంధువులు ఖరీదైన గిఫ్ట్‌లు బహుమతిగా ఇచ్చారు.