Amithab: మెగాస్టార్ బిగ్‌బిపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

Amithab: బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కౌన్ బ‌నేగా క‌రోడా ప‌తి అనే టీవీ షోను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ షోలో భాగంగా అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి(ఐఎంఎఫ్) కీల‌క ఆర్థిక స‌ల‌హాదారు గీతా గోపినాథ్ ఫోటోను స్ర్ర్కీన్‌పై చూపించి.. ఈ ఫోటోలో క‌నిపించే ఆర్థిక వేత్త 2019నుంచి ఏ సంస్థ‌కు చీఫ్ ఎక‌నామిస్ట్‌గా ఉన్నారని Amithab అమితాబ్ ప్ర‌శ్న అడిగారు. ఈ ప్ర‌శ్న‌కే నెటిజ‌న్లు మండిపోతు‌న్నారా!.. అని అనుకుంటున్నారు క‌దా, ఈ ప్ర‌శ్న వ‌ర‌కు ఓకే.. కానీ ఈమె చాలా అందంగా ఉంది.

అస‌లు ఈమెను ఆర్థిక‌వేత్త అంటే ఎవ‌రూ న‌మ్మ‌రు.. అంటూ ఓ కామెంట్ చేశారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్‌గా మారి.. నెటిజ‌న్లు ఈ కామెంట్‌పై మండిప‌డుతున్నారు. గీతా గోపినాథ్ ప్ర‌శ్న అడిగారు బాగుంది. కానీ ఆమె అందంగా ఉంద‌ని అన‌డం ఎందుకు? అస‌లు ఆమె అందం గురించి ప్ర‌స్తావ‌న ఎందుకు? అంటూ నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. బాలీవుడ్ లెజండ‌రీ అయినా Amithab బిగ్ బి లాంటి వ్య‌క్తి ఇలా అన‌డం ఎంత‌వ‌రకు త‌గ‌దని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.