సినిమా ఇండస్ట్రీ నుండి ఆదరణ పొందుతున్న పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు దగ్గరగా వస్తున్నకొద్ది ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా ఈ ఎలక్షన్ వేడి సినిమా ఇండస్ట్రీలో కూడా బాగానే తెలుస్తుంది. ఒక వైపు అధికార వైస్సార్సీపీ ఉండగా మరో వైపు ఎన్డిఏ కూటమిగా భాజపా, టీడీపీ, జనసేన పోతుగా పాల్గొంటున్న విషయం తెలిసింది. ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ అధ్యాకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీ చేస్తుండగా అశేషమైన జనాదరణ పొందుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఆయన కుటుంబ సభ్యులైనా నాగబాబు గారు, ఆయన సతీమణి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేసారు. అంతే కాకుండా కొంత మంది సినీ ఆర్టిస్టులు అయిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే కొత్తగా సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగ వంశీ పవన్ కళ్యాణ్ తరుపున పిఠాపురంలో ప్రచారం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు పద్మ విభూషణ్ చిరంజీవి గారు ఈరోజు ఉదయం సోషల్ మీడియా మాద్యమైన తన X ద్వారా ఒక వీడియో విడుదల చేసారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తనకంటే ఎక్కువగా ప్రజల గురించి ఆలోచిస్తాడు అని, తనకి ఇష్టం లేకుండానే సినిమాలోకి వచ్చాడు కానీ రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చాడని అన్నారు. పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ప్రజలు అండగా ఉండాలని, తమ వోట్ పవన్ కళ్యాణ్ కు వేయాలని కోరుకున్నారు.

ఇది ఇలా ఉండగా నతురల్ స్టార్ నాని తన X మాధ్యమం ద్వారా పవన్ కళ్యాణ్ కు తన సపోర్ట్ తెలిపారు. తన సినిమా కుటుంబమైనా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ ప్రయాణంలో విజయం చేకూరాలని కోరుకుంటున్నట్లు నాని తెలిపారు.

ఈ నెల 13న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అనే విషయం అందరికి తెలిసిందే.