తెలుగు దర్శకులతో ఆ కోలీవుడ్ స్టార్ హీరో వరుస సినిమాలు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికే తెలుగు దర్శకుడు అయినా వెంకీ అట్లూరి తో సార్ సినిమాతో మంచి హిట్ కొట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమాతో మరోసారి తెలుగు దర్శకునితో మన ముందుకు రానున్నారు. కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రా పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుండి వచ్చిన నాగార్జుల లుక్ కు కూడా మంచి బజ్ వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ కోలీవుడ్ స్టార్ హీరో మరో టాలీవుడ్ డైరెక్టర్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. శ్రీకారం సినిమా డైరెక్టర్ అయినా కిషోర్ దర్శకత్వంలో ధనుష్ మరో సినిమా తీసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.