బాహుబలి యొక్క సూపర్ సక్సెస్ తరువాత ఆ సినిమాకు సంబంధించిన పుస్తకాలు, యానిమేషన్ సిరీస్ మరియు ఇతర వస్తువులతో ఫ్రాంచైజీని బాగానే కొనసాగించారు. అయితే ఆర్కా మీడియా వర్క్స్, బాహుబలి నిర్మాతలు డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే, ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ అనే వెబ్ సిరీస్ కోసం ఎస్ఎస్ రాజమౌళి ఒప్పందం ప్రకారం మొదటి ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారు.
ఇక దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు ఇతర ఎపిసోడ్లను డైరెక్ట్ చేశారు. కానీ అకస్మాత్తుగా అవుట్‌పుట్‌పై వారు అసంతృప్తి చెందడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును నిలిపివేసింది. ఇటీవలి నెలల్లో ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి వార్తలు లేవు. అయితే ఆర్కా మీడియా వర్క్స్ సీఈఓ షోబు యర్లగడ్డ ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఎలా చేయవచ్చనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. రాజమౌలి కూడా చర్చల్లో పాల్గొంటున్నారట. నెట్‌ఫ్లిక్స్, మరియు ఆర్కా మీడియా వర్క్స్ త్వరలో ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం.