సుల్తాన్ ఫస్ట్ లుక్ పోస్టర్.. కార్తీ మరో డిఫరెంట్ స్టైల్

ఖైదీ చిత్రంతో అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి బాక్సాఫీస్ హిట్ అందుకున్న కార్తీ నెక్స్ట్ సుల్తాన్ చిత్రంతో మరోసారి అదే తరహాలో హిట్ ఆదుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి రెమో చిత్ర దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో కార్తీతో పాటు యువ గ్లామరస్ హీరోయిన్ రష్మిక మందన్న నటించింది.

తమిళ సినిమాల్లో ఆమె తొలి చిత్రం ఇదే కావడం విశేషం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సుల్తాన్ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ అధికారికంగా విడుదలైంది. ఫస్ట్ లుక్ లో కార్తీ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. రెగ్యులర్ గా కత్తులు కర్రలు రొటీన్ అయ్యాయేమో అందుకే కొరడాతో కనిపిస్తున్నాడు. చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఈ సినిమాతో పాటు కార్తి మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ పాన్నియిన్ సెల్వన్ లో కూడా నటిస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ కార్తీ తెలుగులో ఒక డైరెక్ట్ సినిమాలో చేయాలని అనుకుంటున్నాడు. ఇక సుల్తాన్ సినిమా రిలీక్ డేట్ ని థియేటర్స్ ఓపెన్ చేసిన తరువాత ఎనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.