వందకోట్లతో అపార్టుమెంట్ ని కొనుగోలు చేసిన హృతిక్ రోషన్

నటుడు హృతిక్ రోషన్ ముంబైలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన అపార్టుమెంటులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక అపార్ట్మెంట్ లో డ్యూప్లెక్స్ పెంట్ హౌస్ తో కలిపి మూడు ఫ్లోర్లలో స్థలాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఈ వారం ప్రారంభంలో ఈ ఒప్పందం ముగిసినట్లు సమాచారం, దీని విలువ అటు ఇటుగా వందకోట్ల రూపాయలని టాక్. ఈ అపార్టుమెంట్లు జుహు-వెర్సోవా లింక్ రోడ్‌లోని భవనం యొక్క 14, 15 మరియు 16 అంతస్తులలో ఉన్నాయట.

ఈ అపార్ట్మెంట్ పై నుంచి చూస్తే అరేబియా సముద్రం చాలా అద్భుతంగా కనిపిస్తుందట. ఒక 27534 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న డ్యూప్లెక్స్ కోసం హృతిక్ రూ .67.5 కోట్లు చరిల్లించాడట. ఇక మరో 11165 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 వ అంతస్తు అపార్ట్మెంట్ కోసం రూ .30 కోట్లు చెల్లించారని సమాచారం. ఇక గత కొంతకాలంగా రోషన్ ఒక అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్న విషయం తెలిసిందే. నెలకు దానికి రూ .8.25 లక్షలు చెల్లిస్తున్నారని టాక్.