నితిన్ డబుల్ యాక్షన్.. ఛెక్ పెట్టడానికే..

హీరోలు సింగిల్ స్క్రీన్ పై డబుల్ యాక్షన్ లో కనిపిస్తే ఆ కిక్కే వేరు. ఇక యువ హీరో నితిన్ కూడా ఇప్పుడు అదే తరహాలో అడుగులు వేస్తున్నాడు. వరుస అపజయాల అనంతరం భీష్మ సినిమాతో మళ్ళీ తన మార్కెట్ ని తిరిగి తెచ్చుకున్న నితిన్ ఇప్పుడు కొన్ని డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇక చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఛెక్ అనే సినిమా చేస్తున్న నితిన్ అందులో రెండు విభిన్నమైమ పాత్రలలో కనిపిస్తాడట.

చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు వేసే విధంగా రెండు విభిన్నమైమ పాత్రలు పోటీ పడతాయట. ఒక క్రైమ్ థ్రిల్లర్ గానే కాకుండా మైండ్ గేమ్ తరహాలో ఇద్దరు హీరోల మధ్య సాగే పోరాటం చాలా ఆసక్తిగా ఉంటుందని సమాచారం. సాహసం సినిమా తరువాత దర్శకుడు చంద్రశేఖర్ కూడా మరో హిట్ అందుకోలేదు. మరి ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ప్రియా ప్రకాష్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రంగ్ దే సినిమాను రిలీజ్ కి సిద్ధం చేసిన నితిన్ నెక్స్ట్ ఛెక్ తో పాటు అందాదున్ రీమేక్ ని కూడా సెట్స్ పైకి తేవాలని చూస్తున్నాడు.