హీరోయిన్‌తో అడ్డంగా బుక్కైన డైరెక్టర్

కోలీవుడ్‌లో బెస్ట్ లవర్స్ అనగానే విఘ్నేష్ శివన్‌-నయనతార జంట గుర్తుకొస్తుంది. అంతగా వీరిద్దరు బెస్ట్ కఫుల్స్‌గా పేరు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. బయట ఎక్కువగా కనిపిస్తూనే ఉంది. సినిమా ఫంక్షన్లలో ఎక్కడ చూసినా నయన్,విఘ్నేష్ కలిసే కనిపిస్తారు. ఇప్పుడు ఈ జంట మరోసారి కెమెరాలకి చిక్కింది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ‘కాతు వాకులా రేండు కాదల్’ సినిమాలో నయన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

NAYANATARA

ఇందులో విజయ్ సేతుపతి, సమంత కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నిర్వహించాలని తాజాగా మేకర్స్ భావించారు. ఇందులో పాల్గొనేందుకు విఘ్నేష్, నయన్ కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఈ జంట నడుచుకుంటూ వస్తుండగా.. కెమెరాలు క్లిక్ మనిపించాయి.

వీరిద్దరు చూడటానికి చాలా సింపుల్‌గా, సాధారణ దుస్తుల్లో కనిపించారు. ఇద్దరు చాలా స్ట్రైలిష్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రజనీకాంత్ ‘అన్నాథే’ షూటింగ్‌లో ఏడుగురికి కరోనా సోకడంతో.. ఆ షూటింగ్ ఆపివేశారు. ఈ సమయంలో విఘ్నేష్, నయన్ కలిసి షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో దిగడం విశేషం.