అలియా భట్ పెళ్లి ఫిక్స్. వరుడు ఆ హీరోనే

హీరోయిన్ అలియా భట్‌తో బాలీవుడ్ హీరో రణ‌బీర్ కపూర్ డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో పుకార్లు వస్తున్నాయి. కానీ వీరిద్దరు ఎప్పుడూ ఈ విషయాన్ని అంగీకరించలేదు. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, కరోనా వల్ల వీలు కాలేదని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. అలియా భట్‌, రణ్‌బీర్ పెళ్లి త్వరలో ఉంటుందని తెలుస్తోంది.

ALIA BUTT

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అలియా భట్‌తో తనకున్న సంబంధం గురించి రణ్‌బీర్ బహిరంగంగా బయట పెట్టాడు. లాక్‌డౌన్ సమయంలో ఒక రోజులో 2 నుంచి 3 సినిమాలు చూసేవాడిని అని, అలియా చాలా ఆన్‌లైన్ క్లాసులు తీసుకుందని చెప్పాడు. గిటార్ నుండి స్క్రీన్ రైటింగ్ వరకు ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకుందన్నాడు. ఆమె పక్కన తాను ఎప్పుడూ అండర్ అచీవర్ లాగా భావిస్తానని, తాను మాత్రం ఆమెకు ఎటువంటి తరగతులు తీసుకోలేదన్నాడు.

కాగా ప్రస్తుతం అలియా, రణబీర్ కలిసి ‘బ్రహ్మస్త’ అనే సినిమాలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో కరణ్ జోహర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ఇందులో కీలక పాత్రలలో నటిస్తున్నారు.