Tollywood: రేయ్ న‌రేశ్.. అల్ల‌రి పేరును మార్చుకో.. నాంది సినిమాపై నాని ప్ర‌శంస‌లు!

Tollywood: అల్ల‌రి న‌రేష్ న‌టించిన తాజా చిత్రం నాంది సినిమాపై టాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా నేచుర‌ల్‌స్టార్ నాని నాంది సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ మేరకు త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా నాని తెలుపుతూ.. నాంది సినిమా ఎంతో అద్భుతంగా ఉంది. ఇందులో న‌టించిన అల్ల‌రి న‌రేష్ న‌ట‌న‌ను చూసి ఇక‌పై నువ్వు కామెడీ వేషాలు హీరో అంటే ఊరుకునేది లేదు. రేయ్ రేయ్ ఇక ఆ పేరు మార్చేయ్‌..అల్ల‌రి గ‌తం..భ‌విష్య‌త్తుకు ఇది నాంది.

Nani

Tollywoodఈ సినిమాతో నీలో ఓ మంచి న‌టుడిని చూశాను. చాలా ఆనందంగా ఉంది.. ఇక నుంచి ఇలాంటివి నీ నుంచి మ‌రిన్ని రావాల‌ని కోరుకుంటున్నాను అని నాని ట్వీట్ చేశాడు. ఇక ఈ చిత్రాన్ని విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో.. ఎస్పీ2 ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న Tollywoodఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో న‌టించిన ప్ర‌ముఖ త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ లాయ‌ర్ పాత్ర‌ను పోషించ‌గా.. త‌న న‌ట‌న‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.